ప్ర‌శాంత్ న‌గ‌ర్ కాల‌నీ డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలని విన‌తి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజ‌న్ ప్ర‌శాంత్ న‌గ‌ర్ కాల‌నీలో నెల‌కొన్న డ్రైనేజీ స‌మ‌స్యను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ వాట‌ర్ వ‌ర్క్స్ జీఎంకు మాజీ వార్డు క‌మిటీ స‌భ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ర‌క్త‌పు జంగం గౌడ్ కాల‌నీవాసుల‌తో క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాల‌నీలో అనేక చోట్ల ర‌హ‌దారుల‌పై ఏడాది పొడ‌వునా డ్రైనేజీ నీరు ప్ర‌వ‌హిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా శ్రీ‌రాంన‌గ‌ర్ ఎ బ్లాక్ కొంత భాగం, పోలీస్ క్యాంప్ 8వ బెటాలియ‌న్‌, రాఘ‌వేంద్ర కాల‌నీ, కొత్త‌గూడ విలేజ్‌, స‌ఫారి న‌గ‌ర్‌, గోపాల్ రెడ్డి న‌గ‌ర్‌, వైట్ ఫీల్డ్ త‌దిత‌ర కాల‌నీలు, బ‌స్తీల నుంచి మురుగు నీరు పెద్ద ఎత్తున వ‌చ్చి త‌మ కాల‌నీలోనే క‌లుస్తుంద‌ని, దీంతో పైప్ లైన్ సైజ్ స‌రిపోవ‌డం లేద‌ని, ఒక్క ఫీట్ పైప్ మాత్ర‌మే ఉంద‌ని, ఈ కార‌ణంగా డ్రైనేజీ నీరు బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌హ‌దారుల‌పై ప్ర‌వ‌హిస్తుంద‌ని అన్నారు. క‌నుక ఒక్క ఫీట్ పైప్ స్థానంలో నాలుగు ఫీట్ల ఫైప్ ను వేయాల‌ని డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here