శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండాలో లాలూ నాయక్ ఆధ్వర్యంలో బంజారాల మహోన్నత ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ సేవాలాల్ జీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. సత్యం, సమానత్వం, మానవ సేవ అనే మహోన్నత విలువలను సమాజానికి అందించిన మహారాజ్ బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుమన్ నాయక్ , బాలునాయక్ , మహేందర్ , శివ యాదవ్ , లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.






