శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున అభయాంజనేయ స్వామి దేవాలయం 12 వార్షికోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కృష్ణ, నర్సింగరావు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






