శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ నుంచి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి కార్పొరేటర్ గా గెలిపించి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూకట్పల్లి శాసనసభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ మాధవరం కృష్ణారావుతో కలిసి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని మాధవరం రోజా దేవి రంగారావు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రోజా దేవి మాట్లాడుతూ వివేకానంద నగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిపించి ఐదు సంవత్సరాల కాలంలో డివిజన్ అభివృద్ధిలో సహకరించిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకు, అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవలో ముందుంటానని అన్నారు.






