శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 4 లేబర్ కోడ్‌లు అమానుషమని, అవి వెట్టి చాకిరీకి పరాకాష్టే అని అన్నారు. కేంద్రం ఏకపక్షాన తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, వారి పిల్లలకు ఉచిత విద్యా వైద్యం అందించాలని అన్నారు.






