శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్ల తిరుమలేష్ తన జన్మదినం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీకి తిరుమలేష్ లాంటి యువకుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో యువతకు చక్కని అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వాలా హరీష్ రావు, మల్లారెడ్డి, సంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, సాగర్, సోమేశ్వర్ రెడ్డి, ప్రసాద్, బాబు, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






