శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుత్ ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మయూరినగర్ సబ్ స్టేషన్ 11కేవీ మయూరినగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మయూరి నగర్, ఓల్డ్ ఏజ్ హోం రోడ్డు, కోరుకొండ స్కూల్, ఎస్బీఐ బ్యాంకు రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు. అలాగే వికాస్ సబ్ స్టేషన్ 11కేవీ రెడ్డి కాలనీ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెడ్డి కాలనీ, బీకే ఎన్ క్లేవ్, సాయి జ్యోతి నగర్, సాయి నగర్ కాలనీల్లో కరెంటు ఉండదని, వినియోగదారులు విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.





