శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, బి.ఆర్.ఎస్ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను తాము వ్యతిరేకిస్తున్నామని బిఎంఎస్ అనుబంధ తెలంగాణ ఆటో, ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ఒక ప్రకటనలో తెలిపాయి. సార్వత్రిక సమ్మె వేరు అని, భారత్ బంద్ వేరు అని, సమ్మె పేరుతో బంద్ నిర్వహించడం దేశ పరిస్థితులను దెబ్బతీయడమే అని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిసారి భారత్ బంద్ కు ఆటో డ్రైవర్లను, రవాణా వాహనాలను బంద్ చేయించి చంకలు కొట్టుకునే ప్రయత్నం చేయడాన్ని రాజకీయ పార్టీ సంఘాలు మానుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 12న తెలంగాణలో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆటో, రవాణా బంద్ లేదని, కనుక డ్రైవర్లు యథావిధిగా తమ వాహనాలను నడుపుకోవచ్చని అన్నారు. ఎవరైనా అడ్డగిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఎవరైనా ఆటో డ్రైవర్ల పై దాడి చేస్తే కేసులు తప్పవని, దానికి పోలీస్ శాఖ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ మేరకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి ప్రకటనలో తెలిపారు.





