శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లను తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నందున బిసి అభ్యర్థులను మన ఓట్లు మనకే అన్న బీసీ సూత్రం ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని ఓట్లు వేయాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వ్ స్థానాల్లో బీసీలు వారికి ఓటు వేయాలని కోరారు. మన అభ్యర్థులు ఉన్నచోట వారి ఓట్లు మన ఓట్లు వేయించుకొని అత్యధిక మెజార్టీతో బీసీ అభ్యర్థులు గెలిచేట్టు చూడాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, మేడ్చల్ జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలలో ఈ సందర్బంగా ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో సాయన్న ముదిరాజ్, రాష్ట్ర సెక్రెటరీ మారుతి ముదిరాజ్, ఆర్గనైజర్ సెక్రెటరీ హరికృష్ణ చారి, రాష్ట్ర బీసీ నాయకుడు అశోక్ గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం రమేష్, రజక సంఘం కిషోర్, పద్మశాలి కృష్ణ నేత, మేదరి మహేందర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.






