శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ముగింపు ప్రచారంలో భాగంగా అప్పోజిగూడ, మూర్తాజాగుడా గ్రామ వార్డులలో బీజేపీ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను కమలం పువ్వు గుర్తు పై ఓటు గెలిపించాలని నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నంతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు అంటే మన పట్టణ , మన వార్డు ఎన్నికలని, ఎవరైతే నిజాయతీగా ,మన వార్డు ను అభివృద్ధి చేస్తారో వారిని గెలిపించాలని అన్నారు. బిజెపి అంటే నిజాయతీ, అభివృద్ధి అని, మన ఓటుతో మన కోసం మనతో ఉంటూ పని చేసే నాయకులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, సీనియర్ నాయకుడు అజిత్, డివిజన్ అధ్యక్షుడు జితేందర్, మహిళా మోర్చా నాయకురాలు పద్మ, పార్వతి, జీ.పద్మ, సీనియర్ నాయకులు మహేందర్, కృష్ణ గౌడ్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.






