శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ లో ఉన్న గోపినగర్ చెరువును స్థానికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ సందర్శించారు. చెరువులో గుర్రెపుడెక్కతో పూర్తిగా నిండిపోవడంతో ప్రజలు నరకయాతనకు గురవుతున్నారని, సాయంత్రం పూట దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా వంటి అనేక రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ చెరువు పై ప్రత్యేక దృష్టి పెట్టి గుర్రపుడెక్కను పూర్తిగా తీసివేసి ప్రజలకు దోమల బెడద నుంచి ఉపశమనం లభించేలా చర్యలు తీసుకోవాలని పొట్ట నరేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయలక్ష్మి, మాజీ వార్డ్ మెంబర్ మేకల కృష్ణ యాదవ్, మధు, విష్ణు వర్ధన్, ఎస్ మధు, హర్ష, భీమేష్, మౌలానా, మధు, రాజు, యుగంధర్, పవన్, సల్మాన్, జశ్వంత్, నరసింహ, TEAM PNY సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






