జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేని క‌లిసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరిన‌ట్లు తెలిపారు. దీని పై జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here