శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ నియోజకవర్గంలో ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో B.P, షుగర్, ECG, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్, స్థానిక నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ వెంకటేశ్వర కుమార్, డాక్టర్ గౌతమ్, డాక్టర్ హరీష్, హాస్పిటల్ సిబ్బంది, డంజా క్యాన్సర్ సెంటర్ నుండి వచ్చిన ప్రముఖ వైద్యుడు భాస్కర్ క్యాన్సర్ నివారణ పద్ధతులు, అధునాతన చికిత్సల గురించి ప్రజలకు వివరించారు. మియాపూర్‌లోని ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సమాచారం అందాలనేదే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభు టీమ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






