జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ని క‌లిసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ తో చర్చించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, షైక్ గఫర్, మహమ్మద్ అజాం, మొహమ్మద్ జాకేర్, మహమ్మద్ జావీద్, సయ్యద్ వాజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here