శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ఎమ్మెల్యే పి జనార్దనరెడ్డి 8 అడుగుల కాంస్య విగ్రహాన్ని చందానగర్ PJR స్టేడియం వద్ద ఏర్పాటు చేయడానికి శాసనసభ్యుడు ఆరెక పూడి గాంధీ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పీజేఆర్ గొప్ప నాయకుడని, లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన దైవంతో సమానం అని అన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి, రాఘవరావు, రవీందర్ రావు, రఘునందన్ రెడ్డి, మోహన్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, అక్తర్, కట్ల శేఖర్ రెడ్డి, మిరియాల ప్రీతం, కాలనీ అధ్యక్షుడు రాజయ్య, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.






