శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్,శాంతి నగర్, PA నగర్, శివాజీ నగర్, తారా నగర్, భవానీపురం, శంకర్‌నగర్, సత్య ఎన్‌క్లేవ్, వేమకుంట, ఇక్రిశాట్ కాలనీ, గౌతమీనగర్, కేఎస్ఆర్ ఎన్‌క్లేవ్, రాజేంద్రనగర్, ఫ్రెండ్స్ కాలనీ, పద్మజ కాలనీలలో రూ. 6 కోట్ల 58 లక్షల 50 వేలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, రోడ్డు విభాగిని వంటి పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






