శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లోని పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు శంకరోళ్ళ శేఖర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పద్మ చేవెళ్ళ కు వచ్చారు. చేవెళ్ల మండలం పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ముద్దెంగూడెం జనార్ధన్ ముదిరాజ్, అధికార ప్రతినిధి సబ్బగారిరాజు, చేవెళ్ల మండల కమిటీ అధ్యక్షుడు కూనుకుర్తి అశోక్, ప్రధాన కార్యదర్శి అప్పోజిగూడ వెంకటేష్, శాబాద్ మండల కమిటీ అధ్యక్షుడు కావలి శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి తూర్పాటి శివకుమార్, పార్టీ సభ్యులు సన్మానంము చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ విజయఢంకా మోగిస్తుందని అన్నారు. అనంతరం బీసీ సేన జాతీయ అధ్యక్షుడు భర్క కృష్ణా యాదవ్ ను కలిశారు. అందరూ కలిసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.






