శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ కాలనీలో రూ. 2 కోట్ల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే థీమ్ పార్క్ సుందరీకరణ, అభివృద్ధి నిర్మాణం పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వెంకటాద్రి నగర్ కాలనీ థీమ్ పార్క్ ను అన్ని హంగులతో , అన్ని రకాల మౌళిక వసతులతో సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని అన్నారు. పార్క్ సుందరీకరణ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు , నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మణిక్యాల రావు, బంగారాజు, సత్యనారాయణ, నరేందర్ బల్లా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






