శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట ప్రభుత్వ మండల పరిషత్ హై స్కూల్ (MPHS)ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలకు ఐడిబిఐ బ్యాంక్ సీఎస్ఎఫ్ (CSF) నిధుల ద్వారా రెండు వాటర్ డిస్పెన్సర్లు, రెండు ప్రింటర్లు, రెండు స్పీకర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అధికారికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఐడిబిఐ (IDBI) బ్యాంక్ అందించిన ఈ విరాళాలు పాఠశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన చందానగర్ బ్రాంచ్ ఐడిబిఐ(IDBI) బ్యాంక్ చైర్మన్ వీరబాబు, ప్రతిమకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారిని శాలువాతో సత్కరించి వారి సామాజిక బాధ్యత భావనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.






