శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రంగనాథ్.ఆర్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఈయన 1998లో సీనియర్ న్యాయవాదిగా, సంగారెడ్డి, వికారాబాద్, హైకోర్టులో రంగారెడ్డి జిల్లాలో ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, బార్ కౌన్సిల్ అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం ఇవ్వాలని, మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోవాలని అభ్యర్థించారు.






