హఫీజ్ పేట డివిజన్ లో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట డివిజన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎసి (PAC) చైర్మన్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ తన చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హఫీజ్‌పేట్ డివిజన్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ వివిధ ప్రాంతాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి, త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు. ప్రకాష్ నగర్ అసోసియేషన్ కార్యాలయం, ప్రజయ్ సిటీ అపార్ట్మెంట్, సాగర సంఘం కార్యాలయం, యూత్ కాలనీ, సాయి నగర్, సాయి నగర్ ఆటో స్టాండ్ యూనియన్ కార్యాలయం, హఫీజ్‌పేట్ డబుల్ బెడ్ రూమ్, మియాపూర్ X రోడ్స్, జనప్రియ ఫిఫ్త్ ఫేస్ అపార్ట్మెంట్స్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (బాలింగ్ సత్యయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ కార్యాలయం) ల‌లో జాతీయ పతాకాల‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here