శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప పోరాటయోధుడని, ఆయనను నేటి సమాజం నేటి యువత గుర్తించుకోవాలని అన్నారు. దేశం మనకేమిచ్చిందన్నది కాదు దేశం కోసం మనం ఏం చేశాము అనేది అందరూ గుర్తించుకోవాలని అన్నారు.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బాలరాజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా శ్రీకృష్ణ యూత్ సభ్యులు ముందుంటారని అన్నారు .ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, కే నరసింహ యాదవ్, బుచ్చయ్య యాదవ్, రామేశ్వరమ్మ, మల్లేష్ ముదిరాజ్, సుభాష్ ముదిరాజ్, ఆశా బేగం, యూత్ నాయకులు రాజు, లవణాచారి పాల్గొన్నారు.





