శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హఫీజ్ పేట డివిజన్లో యూత్ కాలనీ, సాయి నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా పతంగులు, మాంజాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను పిల్లలు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యాక్రమంలో సంజు సాగర్ , వెంకటేష్ గౌడ్ , శ్రీనివాస గౌడ్, రంజిత్, కామాజీ, రెడ్డి, ఇషాప్ప, మల్లేష్ , శాంతనా, మహేశ్, బాలరాజ్ పాల్గొన్నారు.






