శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ, శ్రీ భవాని జ్యూవెలరీ వర్క్స్ షాపు యజమాని హరికృష్ణ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోల్డ్ షాప్ వర్క్స్ దినదిన అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యూత్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, భాను ప్రకాష్ చారి , శ్రావణ్ కుమార్ చారి, బీసీ వైస్ ప్రెసిడెంట్ బంగారప్ప పాల్గొన్నారు.






