భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ B బ్లాక్, మాదాపూర్ విలేజ్, కావూరి హిల్స్ కాలనీల లో రూ.1 కోటి 91 లక్షల 50 వేల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ కార్పొరేటర్లు, త‌మ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో ఆయా కాల‌నీల్లో UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ ఆర్ కృష్ణ, డీజిఎం శరత్ రెడ్డి, మేనేజర్ సందీప్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here