శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని మంజీర పైపులైన్ సిమెంట్ రోడ్డుపైన గత సంవత్సరం నుండి నీరు లీకవుతుందని, ఆ లీకేజీని ఆగేలా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులకు బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి ఫిర్యాదుకు స్పందించిన అధికారులు వెంటనే ఒకే ఒక్క రోజులో వచ్చి లీకేజీని ఆపివేశారు. ఈ క్రమంలో అధికారులకు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.






