హెచ్‌-సిటీ ప‌నుల‌ను ప‌రిశీలించిన GHMC అడిషనల్ కమిషనర్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): GHMC అడిషనల్ కమిషనర్ G. శ్రీజన, జోనల్ కమిషనర్ హేమంత్, శాకాపరమైన అధికారులతో కలిసి H – సిటీ పనులలో భాగంగా గుల్ మోహర్ పార్క్ నుండి తారానగర్ ఫ్లైఓవర్, అమీన్‌పూర్ రోడ్, ఆల్విన్ x road ఫ్లైఓవర్ పనుల పురోగతిని సమీక్షించడానికి ప‌ర్య‌టించారు. ఎప్ప‌టి వరకు పనులు పూర్తి చేస్తార‌ని ఆయా శాఖ‌ల‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్వీస్ రోడ్డు పూర్తవుతుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు శ్రీ‌జ‌న‌కి తెలియజేశారు. H-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖాజాగూడ జంక్షన్‌లోని ప్రతిపాదిత ఫ్లైఓవర్, అండర్‌పాస్ స్థలాన్ని కూడా Additional కమిషనర్ సందర్శించారు. జరిగే పనుల విషయం జోనల్ కమిషనర్ హేమంత్, Additional కమిషనర్ G. శ్రీజనల‌కి వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో DC ప్రశాంతి, CCP వెంకన్న, సిటీ ప్లానర్ శ్యామ్, ACP వెంకటరమణ, డిఇ ప్రాజెక్ట్స్ హరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here