శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమలో రెవెన్యూ విభాగం ఏఎంసీ గిరి, టీపీఎస్ రమేష్, ఎస్ఎస్ శ్రీనివాస్, ఇంజినీరింగ్ సెక్షన్ శ్రీదేవి, ఎంటమాలజీ విభాగం ఆర్.చిన్నా, యూబీడీ సెక్షన్ సమీర, ఎలక్ట్రికల్ విభాగం లక్ష్మీ ప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు విభాగాల అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదులను అందజేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 5, ఇంజినీరింగ్లో 1, యూబీడీలో 1 మొత్తం కలిపి 7 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని డీసీ శశిరేఖ అధికారులను ఆదేశించారు.






