శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): జనవరి 18న ఖమ్మంలో జరిగే 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే చిత్రపటాలకు ఆయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి జీపు జాతను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ భారత గడ్డపై సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. 1925 డిసెంబర్ 20న ఆవిర్భావించి శత వసంతాల పార్టీగా అవతరించిందని అన్నారు. కాన్పూర్ లో 2024 డిసెంబర్ 26న ప్రారంభమై దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు, కమ్యూనిస్టు నాయకులు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

జీపు జాత మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రారంభమై కొత్తగూడ, కొండాపూర్, సిఆర్ ఫౌండేషన్, ఆల్విన్, మక్తా, చందానగర్, ఎన్టీఆర్ నగర్, గోపన్పల్లి తండా, ఖాజాగూడ, టెలికాం నగర్ లో ముగిసింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కే చందు యాదవ్, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు కే రామస్వామి, రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు కే సుధాకర్, టి వరలక్ష్మి, తుపాకుల రాములు, ఏఐటిసి మండల అధ్యక్షురాలు ఎస్ నరసమ్మ, ఎస్ కొండలయ్య, డిహెచ్బీఎస్ మండల కార్యదర్శి, లింగంపల్లి సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శులు జెట్టి శ్రీనివాస్, ఎం వెంకటేష్,ఏఐఎస్ఎఫ్ టీ నితీష్, తేజ, మండల కార్యవర్గ సభ్యులు బి నారాయణ, భాస్కర్, ప్రజానాట్యమండలి కళాకారులు రామస్వామి, ఎస్ వాసు, నాగర్ కర్నూల్ జిల్లా ప్రజానాట్య మండలి కళాకారులు, టెలికాంనగర్ కార్యదర్శి కృష్ణ, బంగారి తదితరులు పాల్గొన్నారు.





