శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విభావరి టవర్స్ , BHEL MIG కాలనీ జనని మహిళామండలి , సింధుఆదర్శ్ మహిళామండలి, చందానగర్ లోని వెంకటాద్రి కాలనీ , మియాపూర్ లోని న్యూ కాలనీ , MA నగర్ లలో మహళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పోటీలలో వాణిసాంబశివరావు , ఉమాచంద్రశేఖర్ విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో 150 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వేల్ఫేయిర్ అసోసియేషన్ నాయకులు బి ఎన్ రెడ్డి , రాజేష్ , శ్రీనివాస్, వరలక్ష్మి , వాణి , కుమారి , రాణి యాదవ్ , నాగమణి, లక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.






