బీసీలంద‌రూ ఐక‌మ‌త్యంతో ఉండాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామం రమణియ కాలనీలో కోటగిరి మారుతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఐక్యవేదిక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఆర్కే మారుతి ఆధ్వర్యంలో చిట్కుల్ గ్రామం రమణీయ కాలనీలో బిసి ఐక్యవేదిక సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా స్థానిక బిసి అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ బిసిలందరినీ ఏకం చేసి ఐకమత్యంతో త‌మ‌కున్న సమస్యలను తీర్చే క్రమంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుందాం అని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని సర్పంచ్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు బీసీలందరూ ఏకమై ఐకమత్యంతో ఓట్లు వేసుకొని బీసీలను అత్యధిక స్థాయిలో గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలనీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, స్థానిక బిసి అధ్యక్షుడు, మాజీ వార్డ్ మెంబర్ ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు సాయిలు, ఆర్గ‌నైజింగ్ సెక్రెటరీ హరికృష్ణ చారి, ఈశ్వర్, ప్రసాద్, కృష్ణ ముదిరాజ్, మొయినుద్దీన్, శ్రావణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here