శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి జగదీశ్వర్ గౌడ్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వి.జగదీశ్వర్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు పడిందని, మున్ముందు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.






