శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ పట్టణంతో పాటు 33 జిల్లాల కార్యవర్గాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో సంగారెడ్డి జిల్లా యువజన బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడిగా సతీష్ కుమార్ చారిని యువత అధ్యక్షుడిగా నియమించిన బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ బీసీ కులాలకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బీసీల హక్కుల పోరాటంలో పాల్గొనాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా బీసీలకు అన్నింటా న్యాయం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు ఆర్కే సాయన్న ముదిరాజ్, లింగంపల్లి కన్వీనర్ మనోజ్ ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరికృష్ణ, సంగారెడ్డి యువత అధ్యక్షుడు సతీష్ కుమార్ చారి, రాష్ట్ర కార్యదర్శి మారుతి పాల్గొన్నారు.






