కేటీఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కొత్త ఏడాది సందర్భంగా కేటీఆర్ ను ప్రత్యేకంగా రవీందర్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కి చిర్రా రవీందర్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారాస సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ కు కేటీఆర్ కండువా కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే రవీందర్ యాదవ్ ఈ ఏడాది అన్ని ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలని భగవంతుడిని వేడుకున్నట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ ను కలిసిన స్థానిక భారాస నేతలు, కార్యకర్తలు, శ్రేణులకు, ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అన్ని ఎన్నికల్లో భారాస ఘన విజయం సాధిస్తుందని వెల్లడించారు. అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ లో భారాస సత్తా చాటుతుందన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here