కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నూతన సంవత్సరం ను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని పలు కాలనీల అసోసియేషన్ల‌ సీనియర్ నాయకులు, కార్యకర్తలు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో మీరు తలపెట్టిన ప్రతి పని విజయం సాధించాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖసంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here