శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC దగ్గరగా ఉన్న గ్రామాలు జిహెచ్ఎంసిలో విలీనం అయినందున 24 శాతం హెచ్ఆర్ఏ తీసుకున్న ఉపాధ్యాయులందరికీ సిసిఏ వర్తింపజేశారు. ఈ క్రమంలో వీరికి ఒక్కొక్కరికి రూ.1250 లాభం చేకూర్చారు. జిహెచ్ఎంసిలో విలీనం జరిగిన వెంటనే పి ఆర్ టి టి ఎస్ జిల్లా అధ్యక్షుడు మానేయ, ప్రధాన కార్యదర్శి ప్రభు స్పందించి కలెక్టర్ కి 24 శాతం హెచ్ఆర్ఏపై వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి 24 శాతం హెచ్ఆర్ఏ తీసుకున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ సి సి ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులకు లాభం చేకూరేందుకు కృషి చేసిన మానేయ, ప్రభుకి పి ఆర్ టి యు టి ఎస్ జిన్నారం మండల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






