శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను జలమండలి డీజీఎంతో కలిసి చందానగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. కాలనీలో రోడ్ నంబర్ 3లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వారు పరిశీలించి తక్షణమే సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని కాలనీ అధ్యక్షుడు డి.వెంకటేశం ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అర్జున్ రెడ్డి కాలనీ సమీపంలో ఉన్న డ్రైనేజీ లైన్‌ను మళ్లించాలని కోరినట్లు తెలిపారు.






