శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా చందానగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం మిర్యాల ప్రీతం మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని, దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నెలకొని, సమాజంలో ఐక్యత, సౌహార్దం మరింత బలపడాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.






