శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, విద్యుత్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సరైన డ్రైనేజీ వ్యవస్థ ఇంటి పునాదిని రక్షిస్తుందని, తగినంత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇంటి చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాలలో నీరు పేరుకుపోతుంది, ఇది బేస్, గోడలు, ఫ్లోరింగ్‌కు హాని కలిగిస్తుందని, స్థానికవాసులు డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సమస్యను ఫిర్యాదు చేయాలని, సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టి సంబంధిత అధికారులను ఆదేశిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజిఎం నారాయణ, మేనేజర్ శ్రీకాంత్, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, ఎలక్ట్రికల్ ఏఈ హుస్సేన్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ కవిత గోపికృష్ణ, కే రాంచందర్, నారాయణ, లక్ష్మణ్, యాదగిరి, ఖాజా పాషా, శ్రీనివాస్, పాండు ముదిరాజ్, అహ్మద్, రహీమ్, అజీమ్, రాంచందర్ యాదవ్, వెంకటేష్, సురేష్, రాజేందర్, రమేష్, మహావీర్, అనిల్ కుమార్, దీన్ దాయర్, మోయిస్, షరీఫ్, లాలా, సల్మాన్, అజామ్, హేమంత్ పరీక్, మల్కయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు.





