శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. టెక్సాస్, యూఎస్ఏ నుండి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువు శ్రీలత సూరి శిష్య బృందం పరి పరి నీ పదమే, సూర్యాష్టకం, మీనాక్షి పంచరత్న , స్వాగతం కృష్ణ , భూదేవి వరాహ, ధనశ్రీ తిల్లాన అంశాలను కూచిపూడి నృత్యం ద్వారా ప్రదర్శించి అలరించారు. మిత్రాంగన్ హైదరాబాద్ మహారాష్ట్ర అసోసియేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు లావని, గొందల్, మళ్ఖంబు , డోల్ తాషా అంశాలను కళాకారులందరూ అంబరీష్ లహంకర్ ఆధ్వర్యంలో ప్రదర్శించి మెప్పించారు.






