శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మసీదుబండ జడ్.పి.హెచ్. హైస్కూల్, కొత్తగూడ జెడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి, ట్రస్ట్ సెక్రటరీ, ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు. తమ కుటుంబంలో అందరికీ విద్య అంటే చాలా ఇష్టమని, పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, పవన్ కుమార్ , నాయకులు సదానంద్ యాదవ్, మహేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆంజనేయులు సాగర్, లక్ష్మణ్, అరవింద్, గణేష్, పద్మ, రవి నాయక్, విష్ణు , శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్, అరుణ్, శ్రీకాంత్, కల్యాణ్, రాము, కిరణ్, కృష్ణ, మహేందర్, రంగారెడ్డి, రామిరెడ్డి, జయరాం, కిరణ్, బ్రహ్మం, వెంకటేష్, నాగులు, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.






