శ్మ‌శాన వాటిక ను సందర్శించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా బంజారా శ్మ‌శాన వాటికను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మ‌శాన వాటికలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బంజారా శ్మ‌శాన వాటికలో సీసీ రోడ్డు, బోర్‌వెల్ రిపేర్, స్నానపు గదుల ఏర్పాటు, బర్నింగ్ పాయింట్, సరిపడా లైటింగ్, మెయిన్ గేట్ నిర్మాణం వంటి మౌలిక వసతులు అత్యవసరంగా అవసరమని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ధామం ప్రతి మనిషి జీవితంలో గౌరవప్రదమైన చివరి మజిలీ. అలాంటి పవిత్ర స్థలంలో మౌలిక వసతుల కొరత ఉండకూడదు. శ్మ‌శాన వాటికలో అవసరమైన అన్ని వసతులు కల్పించడమే మా బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శ్రీరామ్, నర్సింగ్ నాయక్, కిషన్, బబ్లూ, విజయ్, ఉమామహేశ్, ప్రభు, రంగస్వామి, చిన్న, రవి, పండు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here