శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్, మార్తాండ్ నగర్ సీనియర్ నాయకురాలు కవిటి లక్ష్మి, శ్యామ్ సుందర్ దంపతులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ప్రముఖ సౌత్ ఇండియా సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దయామయుడైన ఆ యేసుక్రీస్తు కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆ శాంతమూర్తి చూపిన దారిలో మనం నడిచి, ప్రతి ఒక్కరి పట్ల దయ, జాలి కలిగి ముందుకు సాగుదామని అన్నారు. కవిటి లక్ష్మి, శ్యామ్ సుందర్ కి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు.






