శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే, GHMC, అన్ని సర్కిళ్ల ఉప కమిషనర్‌లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తదితర అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషి తో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇచారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే తెలిపారు.






