ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రజల సంక్షేమానికి ప్రతీక: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత పాలనకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్, మియాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ రవి, నియోజకవర్గ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ క్యాంటీన్‌లు పేదలు, కూలీలు, వలస కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు వంటి అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు శుభ్రమైన, పోషకాహారాన్ని అందిస్తున్న ఒక కీలక సంక్షేమ కార్యక్రమమని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ క్యాంటీన్‌ల నిర్వహణ జరుగుతూ, ఉపాధి కల్పనతో పాటు పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం భారతరత్న, భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 21వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, సయ్యద్ గౌస్, రవీందర్ రెడ్డి, వీరేందర్ గౌడ్, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివ రావు, వెంకట్రావు, రాజన్, కట్ల శేఖర్, అశోక్, శేఖర్ ముదిరాజ్, లక్ష్మణ్, గంగల గణేష్, రాంచందర్ గౌడ్, రవి కుమార్, షరీఫ్, సుదర్శన్, ముజీబ్, వాసు, శ్రీనివాస్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here