శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ ఫేజ్ 1 కాలనీ లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, హార్టికల్చర్, జలమండలి విభాగం అధికారులతో, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులతో కలిసి కాలనీ లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించామని, కాలనీ లో పర్యటించి, కాలనీ వారి విజ్ఞప్తి మేరకు సమస్యలను తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. అలాగే ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగిందని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దాసు, జలమండలి మేనేజర్ విలియం పాల్, సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






