డివిజన్ లో పార్క్ ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం అధికారులతో పర్యటించి పార్క్​‍లోని సమస్యలను స్వయంగా వాకర్స్​‍ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పార్క్​‍లోకి వాకింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్‌ ట్రాక్‌ను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సందర్శకుల కోసం పార్క్​‍ చుట్టుపక్కల మొక్కలు, పుట్‌పాత్‌లపై బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని కార్పొరేటర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ బయోడైవర్సిటీ మేనేజర్ విక్రమ్ చంద్ర, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, బసవయ్య, కోదండరాం, సెక్రటరీ భాను, వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ, జాయింట్ సెక్రటరీ జితేందర్ రెడ్డి, సలహాదారులు చంద్రశేఖర్, అజయ్, దుర్గాప్రసాద్, శేఖర్, రమణ కుమార్, భాస్కర్, మహిళా నాయకురాళ్లు భాగ్యలక్ష్మి, కుమారి, కళ్యాణి, సుధారాణి, లక్ష్మి, జయ, యామిని, కవిత, వాణి, యూబీడీ సూపెర్వైసర్ గోపాల్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here