ముజ‌ఫర్ అహ్మద్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్బంగా ఏఐఎఫ్ డిఎస్ నాయకులు అరుణ్, యం శ్రీకాంత్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ ముజఫర్ అహ్మద్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసి పుస్తకాలు, పలు స్టేషనరీ వస్తువుల‌ను AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, MCPI నాయకుడు తుడుం అనిల్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు కవిరాజు, పాస్టర్ సుకుమార్ హాజరై కేక్ కట్ చేసి విద్యార్ధులకు క్రిస్మ‌స్ పండుగా శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు అంగడి పుష్ప, సుల్తానా బేగం, రజియా బేగం, డప్పు రాములు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here