- మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్
మాదాపూర్/గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని సిద్దిక్నగర్, అంజయ్య నగర్, గచ్చిబౌలి గ్రామాలలో మాదాపూర్ జోన్ పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓటు ప్రజల హక్కు అని, ఆ హక్కు ను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగి, చందానగర్, ఆర్సీ పురం, ఇన్స్పెక్టర్ లు రవీంద్ర ప్రసాద్, నవీన్ కుమార్, రవీందర్, రాజ గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, కాస్ట్రో, జగదీశ్, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.







