మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్
కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తాను ఎమ్మెల్యే గా అందించిన సేవలు గుర్తున్నాయని, ప్రజా సమస్యల విషయంలో ఎల్లపుడు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో ఏర్పాటు చేసిన బిజెపి పార్టీ కార్యాలయాన్ని బిక్షపతి యాదవ్ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో కొండాపూర్ డివిజన్ లో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు సమకూర్చిన విషయాన్నీ గుర్తు చేసారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు. డివిజన్ ప్రజలంతా బిజెపి అభ్యర్థి రఘునాథ్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని, డివిజన్ ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రశేఖర్ యాదవ్, గోపాల కృష్ణ, రాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
